ఆకర్షణీయ ధరకు “గబ్బర్ సింగ్” ఓవర్సీస్ హక్కులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “గబ్బర్ సింగ్” చిత్ర ఓవర్సీస్ హక్కులను బ్లూ స్కై వారు అద్బుతమయిన ధరకు కొనుక్కున్నారు. దాదాపుగా మూడు కోట్లకు వీరు ఈ హక్కులను కొనుక్కున్నట్టు సమాచారం. ఎనిమిది మంది మధ్య నెలకొన్న పోటిలో వీరు ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 2012 మే లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 15న ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది.

Exit mobile version