సంక్రాంతి నుండి తప్పుకున్న బాలయ్య

సంక్రాంతి నుండి తప్పుకున్న బాలయ్య

Published on Dec 13, 2011 4:50 PM IST

ప్రతిసారి సంక్రాంతి రేసులో ఉండే బాలయ్య ఈసారి మాత్రం రావట్లేదు. బాలకృష్ణ నటిస్తున్న అధినాయకుడు సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అధినాయకుడు జవరి 26న విడుదల విడుదల కానున్నట్లు సమాచారం. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మాత. బాలయ్య సరసన సలోని మరియు లక్ష్మి రాయ్ నటిస్తుండగా బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు