పూర్తయిన ‘బాహుబలి’ వార్ షెడ్యూల్

పూర్తయిన ‘బాహుబలి’ వార్ షెడ్యూల్

Published on Apr 6, 2014 12:59 AM IST

Baahubali-war-schedule-wrap
మూడు నెలల ఎడ తెరిపిలేని షూటింగ్ తర్వాత ‘బాహుబలి’ వార్ షెడ్యూల్ పూర్తి కావొచ్చింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్, రాణా, అనుష్క, తమ్మన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అర్క మీడియా వర్క్స్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్ర రావు సమర్పిస్తున్నారు.

గత మూడు నెలలుగా ఈ చిత్ర బృందం మొత్తం విరామం లేకుండా ఇండియన్ సినిమా లోనే గొప్పదైన ఒక వార్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ముఖ్య తారాగణం తో పాటు షూటింగ్ లో పాల్గొన్న వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లకి ఎంతో కృషి చేసినందుకు రాజమౌళి థాంక్స్ చెప్పాడు. “ఒక హెవీ షెడ్యూల్ పూర్తి కావొచ్చింది చాలా కష్టపడిన వైజాగ్ జిం బాయ్స్ కి వినయ్ బ్యాచ్, తౌఫీక్ బ్యాచ్ లకి ప్రత్యేక కృతజ్ఞతలు వారు ఉదయం 5:30 కి వచ్చేవారు వెంటనే కాస్ట్యూమ్స్ వేసుకుని వార్ పెయింట్ వేసుకుని పరిగెత్తేవారు అరిచేవారు సాయత్రం వరకు ఎండ లో ఎంతో ఉత్సాహం తో పోరాడేవారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణ వాళ్ళ సహాయం లేకుండా చేయలేకపోయేవాడిని” అని రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా లో పేర్కొన్నాడు.

కొంత విరామం తర్వాత ఈ టీం ఇంకో షెడ్యూల్ ప్రారంభిస్తారు. భవిష్యత్తు షెడ్యూల గురించి ఇంకా వెల్లడి కావాల్సివుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి సెంథిల్ చాయాగ్రహణం అందించారు. సబు సిరిల్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

తాజా వార్తలు