“నీకు నాకు డాష్ డాష్” బృందంలో అనూప్ రూబెన్స్

పూల రంగడు,ఇష్క్ మరియు లవ్లీ చిత్రాలు విజయం సాదించడంతో అనూప్ రూబెన్స్ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు “నీకు నాకు డాష్ డాష్” చిత్ర బృందంలో కలిశారు. నిజానికి ఈ చిత్రానికి యశ్వంత్ సంగీతం అందించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం అనూప్ ని తీసుకున్నారు. “జై” చిత్రంతో అనూప్ ని తేజ పరిచయం చేశారు. తరువాత వీరు ఇరువురు కలిసి “ధైర్యం” చిత్రం చేశారు. ఈ చిత్ర నిర్మానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. ఈ వారంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. లిక్కర్ మాఫియా నేఫధ్యం లో సాగే ఈ చిత్రం లో ప్రిన్సు మరియు నందిత ప్రధాన పాత్రలు పోషించారు. రసూల్ ఎల్లోర్ అందించియన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అంటున్నారు. తెలుగు చిత్ర చరిత్రలో రెడ్ ఎపిక్ కెమెరాని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది

Exit mobile version