ప్రారంభమయిన అనిల్ సుంకర యాక్షన్

దూకుడు చిత్ర నిర్మాతల్లో ఒకరయిన అనిల్ సుంకర “యాక్షన్” చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నారు. ఈ చిత్రానికి “విత్ ఎంటర్ టైన్మెంట్” అని శీర్షిక ఉండబోతుంది. ఈ చిత్రం ఇవాళ చెన్నై లో ప్రారంభం అయింది ఈ వేడుకకు కే రోశయ్య, శ్రీను వైట్ల, శింభు, ఏయం రత్నం, వెంకట్ ప్రభు ,గోపీమోహన్,కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి 3డిలో చిత్రీకరించబడుతుంది. తెలుగు చిత్రానికి శ్రీను వైట్ల క్లాప్ కొట్టగా కోదండ రామి రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. తమిళ చిత్రానికి శింబు క్లాప్ కొట్టారు గౌరవ దర్శకత్వం వెంకట్ ప్రభు వహించారు. అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్ రెడ్డి, రాజు సుందరం, స్నేహ ఉల్లాల్, విమలా రామన్ మరియు కామ్నజేత్మలని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ పదిహేను కోట్లు వరకు ఉండబోతుంది. సుంకర రామ బ్రహ్మం ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. బప్పి లహరి కొడుకు బప్పా లహరి ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేక పాటను స్వరపరుస్తున్నారు ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి నేఫధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.

Exit mobile version