అమల పాల్ ,నేడుముడి వేణు,ఇంద్రజిత్ మరియు పృథ్విరాజ్ లు ప్రధాన పాత్రలలో నటించిన మళయాళ చిత్రం “అకాశతింటే నీరం” పదిహేనవ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికయ్యింది. గోల్డెన్ గోబ్లేట్ అవార్డు కోసం ఒక మలయాళ చిత్రం పోటి చెయ్యటం ఇదే మొదటిసారి. డా.బిజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ద్వీపంలో నివసిస్తున్న ముసలాయనకి ఒక దొంగ మూలాన ఎదురయిన అనుభవాల మీద ఈ చిత్రం నడుస్తుంది. అమల పాల్ ఈ చిత్రంలో ముసలాయనతో పాటు అదే ద్వీపంలో నివసించే మూగ మరియు బధిర అమ్మాయి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మొత్తం అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల్లో చిత్రీకరించారు. షాంఘైలో ప్రిమియర్ తరువాత ఈ చిత్రం జూలైలో ఇండియాలో విడుదల కానుంది. ఈ చిత్రం కాకుండా అమలా పాల్ మరో మళయాళ చిత్రం “రన్ బేబీ రన్”లో మోహన్ లాల్ సరసన కనిపించనుంది. తెలుగులో ప్రస్తుతం వి.వి.వినాయక చిత్రంలో రామ్ చరణ్ చేస్తున్న చిత్రంలో నటిస్తుంది ఇది కాకుండా జూన్ లో మొదలయ్యే నాని మరియు జయం రవిల ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. చూస్తుంటే అమల పాల్ కెరీర్ వేగంగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది.