వాసు వర్మతో చిత్రం చెయ్యబోతున్న అల్లు అర్జున్

వాసు వర్మతో చిత్రం చెయ్యబోతున్న అల్లు అర్జున్

Published on Dec 29, 2011 1:58 AM IST

అల్లు అర్జున్ ఎట్టకేలకు వాసు వర్మ చిత్రాన్ని ఒప్పుకున్నారు. గతం లో వాసు వర్మతో అల్లు అర్జున్ చిత్రం చెయ్యబోతున్నారు అని పుకారు నడిచింది. వాసువర్మ గతం లో నాగ చైతన్య తో “జోష్” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టుకోనుందని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న చిత్రం తరువాత ఈ చిత్ర చిత్రీకరణ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి “లవ్లీ” అనే పేరు ని అనుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మర్రిన్ని విశేషాలు కొద్ది రోజుల్లో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు