విమలారామన్, కృష్ణుడు, శశాంక్, అర్చన, సమీక్ష ప్రధాన పాత్రధారులుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘కులుమనాలి’ చిత్రం ఆడియో విడుదల జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా అల్లరి నరేష్ హాజరయ్యారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ” ఈ చిత్రం గురించి కొంతమంది హేళన గా మాట్లాడారు వారికి నేను చెప్పేదో ఒక్కటే ప్రోత్సాహించకపోయిన పర్లేదు నిరుత్సహపరచకండి” అని అన్నారు. ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి నాని, ఉదయ్‌కిరణ్, తనీష్ , భీమినేని శ్రీనివాసరావు, హరీష్‌శంకర్, దేవీప్రసాద్,ఆర్పీ.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.