చిన్న విరామం తర్వాత ఆది కొత్త చిత్రం ‘గాలిపటం’ షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. కొన్నివారలా క్రితం షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రంలో ఆదితో పాటు ఎరికా ఫెర్నాండేజ్, కృష్ణ అకీవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ రొమాంటిక్ మరియు కుటుంభకథా చిత్రం లో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
సంపత్ నంది నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవీన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆదితో పాటు మిగిలిన తారాగణం కొన్ని వారల పాటు ఈ చిత్రం పై దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది.
ఇదిలావుండగా రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ‘ప్యార్ మే పడిపోయమే’ చిత్ర షూటింగ్ ఆది పూర్తి చేసాడు. శాన్వి హీరోయిన్ గా నటించిన ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ త్వరలో విడుదల కానుంది.