బాలనాగమ్మ చిత్రాన్ని నిజమైన తెలుగు ఆణిముత్యం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలై 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఏడుగురు యువరాజులు ఏడుగురు యువరాణులని వివాహమాడతారు. మాంత్రికుడు అతి పిన్న వయస్కురాలైన యువరాణి ని బలవంతంగా ఎత్తుకోనిపోతాడు. ఆ యువరాణి కొడుకు కనిపించని చెట్టులో ఉన్న పిట్టని కనిపెట్టి మాంత్రికుడిని ఎలా చంపాడు అన్నదే చిత్ర కథ. పతాక సన్నివేశాలు రామాయణ మరియు మహాభారతాలను తలపిస్తాయి. ఈ చిత్రంలో బాల నాగమ్మగా కాంచనమాల నటించగా సంగు గా పుష్పవల్లి మరియు రేలంగి కూడా నటించారు. ఈ సినిమాకి అసలైన మాంత్రికుడు కెమెరామెన్ ఎమ్. ఇరానీ అని చెప్పుకోవాలి. ఇండియన్ సినిమాని సరికొత్త దారిలో తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఆన్ని శాఖలు సరిగా పనిచేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరిన్ని జానపద చిత్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ చిత్రనికి గొప్ప దర్శకుడు కె.వి రెడ్డి (మాయా బజార్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జెమిని ఫిల్మ్స్ వారికీ కాసుల వర్షం కురిపించింది. బాలనాగమ్మ చిత్రం హిందీ కూడా నిర్మించగా మధుబాల హీరోయిన్ గా నటించగా మహానటి సావిత్రి గారు సంగు పాత్ర పోషించారు.
70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ
70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ
Published on Jan 29, 2012 9:18 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్‌లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


