న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో “3”

న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో “3”

Published on May 20, 2012 7:43 PM IST

ధనుష్,శ్రుతి హాసన్ లు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “3” ప్రతిష్ఠాత్మక న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికయ్యింది. మే 23 నుండి 27 వరకు న్యూ యార్క్ లో ఈ ఫెస్టివల్ జరగనుంది. “3” చిత్రం మే 26న ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన ఐశ్వర్యకి ఇది ఆనందదాయకమయిన విషయం.ఇలా నిర్వహించే ఫిలిం ఫెస్టివల్స్ ప్రాంతీయ చిత్రాలను అక్కడి ప్రజలకి పరిచయం చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గత కొన్నేళ్ళుగా తమిళ చిత్రాలు ఇలాంటి ఫెస్టివల్స్ ప్రపపంచమంతటా నిర్వహిస్తున్నాయి ఫలితంగా ఐరోపా దేశాలలో తమిళ చిత్ర పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుంది. ధనుష్ మరియు తాప్సీ నటించిన “ఆడుకాలం” కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఒక్క తెలుగు చిత్రం కూడా ప్రదరించడం లేదనేది అతిశయోక్తి కాదు.”3 ” చిత్రం ఇంతటి ఘనత సాదించినందుకు చిత్ర బృందానికి శుభాకాంక్షలు.

తాజా వార్తలు