కృష్ణుడి తో “నాకు ఓ లవరుంది” చిత్రాన్ని నిర్మించిన కే.సురేష్ బాబు, “1940లో ఒక గ్రామం” చిత్రం తో జాతీయ అవార్డ్ ని గెలుచుకున్న దర్శకుడు నరసింహ నంది కలిసి ఒక చిత్రాన్ని చెయ్యబోతున్నారు. ప్రముఖ హీరో నటించబోతున్న ఈ చిత్రం లో పలువురు ప్రముఖ తారలు కనిపించబోతున్నారు. క్రీడా నేఫధ్యానికి వాణిజ్య అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర పాటల రికార్డింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి మురళి మోహన్ రెడ్డి కెమెరా అందిస్తున్నారు.