మార్చ్ 14 న నీకు నాకు డాష్ డాష్ ఆడియో విడుదల

మార్చ్ 14 న నీకు నాకు డాష్ డాష్ ఆడియో విడుదల

Published on Mar 14, 2012 12:28 AM IST

తేజ చిత్రం “నీకు నాకు డాష్ డాష్” ఇప్పటికే అందరిలో ఆసక్తిని సృష్టించింది. ఈ చిత్రం లిక్కర్ మాఫియా లో జరిగే ప్రేమ కథగా ఉండబోవటం అందరు నూతన నటులనే ఎంచుకోవటం తేజ చాలా కాలం తరువాత చిత్రాన్ని చెయ్యటం ఈ చిత్ర విశేషాలను నటినటులను గోప్యంగా ఉంచటం వంటి పలు అంశాలు ఈ చిత్రం మీద అంచనాలు పెరగటానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం చిత్ర విడుదల తేదీ దగ్గర అవుతుండడం తో ప్రచారం మీద దృష్టి సారించారు మార్చ్ 14న ఈ చిత్ర ఆడియో ని వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చెయ్యబోతున్నారు. ఈ విషయం అడుగగానే వెంకటేష్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. శిల్పకలరామం లో రాక్ హిట్స్ లో ఈ ఆడియో విడుదల జరగనుంది ఈ చిత్రం తో యశ్వంత్ అనే నూతన సంగీత దర్శకుడు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తుంది.

తాజా వార్తలు