“అమ్మ.. ది స్ట్రీట్” ఆడియో విడుదల

“అమ్మ.. ది స్ట్రీట్” ఆడియో విడుదల

Published on Mar 13, 2012 8:30 AM IST

ఆస్థా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనాధ పిల్లల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అమ్మ ద స్ట్రీట్’. ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్ర తొలి సి డి ని దర్శకుడు తన తల్లి మణెమ్మ చేతుల మీదుగా విడుదల చేయించడం విశేషం. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘అనాధ బాలల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వారి కష్టాలను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రం చేశాను. రాజన్న ఫేం నేహ ప్రధాన పాత్రధారిగా నటించింది.తన నటన చిత్రానికి హైలైట్ అవుతుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. మహేంద్రబాల, భానుశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సుభాష్ సంగీతం అందించారు. పి.వీర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే నరేంద్రకుమార్ రెడ్డి నిర్మించారు.

తాజా వార్తలు