మోహన్‌బాబు ఇంట్లో దుండగుల హెచ్చరికలు !

మోహన్‌బాబు ఇంట్లో దుండగుల హెచ్చరికలు !

Published on Aug 1, 2020 10:36 PM IST


కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు హెచ్చరించి వెళ్లారు. అసలు వాళ్ళు ఎవరు ? ఎందుకు లోపలకి వచ్చి మోహన్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారు ? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సంఘటనతో భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.

అయితే దుండగులు ఇంట్లోకి ప్రవేసించడానికి కారణం వాచ్ మెన్ నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే వాళ్ళు ఇంట్లోకి వచ్చారట. .ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు సమాచారం. మరి ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయినా మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం ఎవరికీ ఉంది, మోహన్ బాబుకు ఆ స్థాయి శత్రువులు ఎవరా అన్న చర్చ మొదలైంది. ఆకతాయిలైనా కావాలనే ఇలా చేశారా లేక నిజంగానే మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పూనుకున్నారా అన్నది దర్యాప్తులో తేలనుంది. ఏమైనా ఈ సంఘటన మంచు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేదే.

తాజా వార్తలు