వచ్చే వారంలో ‘మిర్చి’ ఫస్ట్ లుక్?

వచ్చే వారంలో ‘మిర్చి’ ఫస్ట్ లుక్?

Published on Oct 19, 2012 3:40 PM IST


మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా మారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘మిర్చి’ అనే టైటిల్ ని దాదాపు ఖరారు చేసారని మేము ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అంటే అక్టోబర్ 23న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే దీపావళికి ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యోగా బ్యూటీ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పల పాటి మరియు వంశీ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జారుకుంటున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్లో విడుదల చేసి, సినిమాని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు