ముంబైలో ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్

‘హను-మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే, ప్రస్తుతం మరో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మిరాయ్’లో నటిస్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని ముంబైలోని హిస్టారికల్ గుహల్లో చిత్రీకరిస్తున్నారు. తేజ సజ్జాతో పాటు ఈ షూటింగ్‌లో పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో బ్లాక్ స్వార్డ్ అనే నెగిటివ్ పాత్రలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే వీరికి సంబంధించిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version