పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించిన చిత్రం “హరిహర వీరమల్లు” ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతుంది. వీక్ డేస్ లో అలాగే, వర్షాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం వీకెండ్ కి వచ్చేసరికి డీసెంట్ రన్ ని అందుకుంది.
అయితే సినిమాలో సెకండాఫ్ విషయంలో పలు కంప్లైంట్స్ వినిపించగా వాటితో పాటుగా టికెట్ ధరలు కూడా ఆడియెన్స్ ని కొంచెం దూరం చేసాయి అని టాక్ వినిపించింది. ఇక వీటితో పాటుగా రేపు మళ్ళీ వర్కింగ్ డే సోమవారం నుంచి అసలు టెస్ట్ సినిమాకి మొదలు కానుంది. కానీ ఇక్కడ వీరమల్లుకి నెగ్గే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పాలి.
ఎందుకంటే ఈ సోమవారం నుంచే సినిమాపై ఉన్న హైక్స్ అన్నీ ఎత్తేసారు. పైగా సినిమాలో కంటెంట్ కూడా అప్డేట్ చేశారు. సో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా లేదా అనేది అసలు ప్రశ్నగా మారింది. తగ్గించారు కాబట్టి వచ్చే సూచనలు ఉన్నాయి సో ఈరోజుతో సినిమా రన్ విషయంలో ఏదోకటి తేలిపోతుంది.