పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ హిస్టారికల్ అండ్ సందేశాత్మక చిత్రమే “హరిహర వీరమల్లు”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతికృష్ణలు తెరకెక్కించిన ఈ భారీ సినిమా పవన్ కెరీర్లో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే రిలీజ్ అయ్యాక మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ సినిమాపై వినిపిస్తున్నాయి. దీనితో హరిహర వీరమల్లు చిత్రం ఇప్పుడు వచ్చిన కథ వేరట.
నిజానికి క్రిష్ ప్లాన్ చేసుకున్న సినిమా కథ మొత్తం కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుంది. అని మధ్యలో సినిమా పలు మార్లు బ్రేక్ పడడంతో మేకర్స్ ఆ వెర్షన్ ని తెరకెక్కించడం సాధ్యపడలేదు అని జ్యోతికృష్ణ లేటెస్ట్ గా రివీల్ చేశారు. దీనితో అసలు విషయం బయటకి వచ్చింది. మరి కంప్లీట్ ఆ వెర్షన్ లో సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.