రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమాలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మద్య విడుదలైన ‘తూఫాన్’ ఆహించినంత విజయాన్ని సాదించకపోవడంతో నిర్మాతలు ఎటువంటి రిస్క్ తీసుకునే పరిస్తుతుల్లో లేరు. దానితో సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా చేస్తున్న మార్పులతో ఈ సినిమా మంచి వేగాన్ని పొంజుకుంటుందని సమాచారం. ఈ సమాచారాన్ని మేము స్వతంత్రంగా రాయడంలేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల దృష్ట ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు సంబంధించి కొత్త తేదిని ప్రకటించలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాకు సంబందించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ వుంటాం.