ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలకు రెడి అయిన చిత్రాల్లో మన దక్షిణాది నుంచి అయితే నాని నటించిన లేటెస్ట్ చిత్రం “వి” కు వచ్చిన భారీ రెస్పాన్స్ మరే ఇతర సినిమాకు కూడా రాలేదని చెప్పాలి. అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అని అనౌన్స్ చేశాక మరింత స్థాయిలో ఈ చిత్రానికి ఆదరణ దక్కింది.
అయితే ట్రైలర్ అనౌన్స్మెంట్ విషయంలో అయితే అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వారిని మనోళ్లు ఒక్క లెక్కలో ఆడుకున్నారు. ఇవి పక్కన పెడితే ఈ చిత్ర ట్రైలర్ కోసం వారు ఒక వినూత్న కాంటెస్ట్ పెట్టగా దానికి 7 గంటల్లోనే ఒక లక్ష 11 వేలకు మంది పైగా రెస్పాండ్ అయ్యి పాల్గొన్నారు.
దీనికి గాను నాని కూడా ట్వీట్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి మాత్రం ఈ “వి”చిత్రం “వి”డుదలకు ముందే భారీ రెస్పాన్స్ ను అందుకుంది. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో మెయిన్ లీడ్ లో నటించగా అదితి రావ్ హైదరీ మరియు నివేత థామస్ లు ఫిమేల్ లీడ్ లో నటించారు. ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ గా విడుదల కానుంది.
రేపు సాయంత్రానికి అవుతుంది అనుకున్నారు…మీరు రేపు పొద్దునకే ఫిక్స్ అయ్యారు…
నాకు అదే కావాలి…????#VTrailerOnPrime https://t.co/h7ks9l47S5
— Nani (@NameisNani) August 25, 2020