పవన్ రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరుగుద్ది.!

పవన్ రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరుగుద్ది.!

Published on Oct 10, 2020 2:55 PM IST

మన టాలీవుడ్ లో పవన్ డేట్ కు భారీ డిమాండ్ ఏర్పడిపోయింది ఇపుడు. తాను ప్లాపుల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ ఒక రోజు డేట్ ఇస్తే దాని రేటు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం పవన్ ఇప్పటికే పలు చిత్రాలను లైన్ లో పెట్టారు. అలాగే వాటిలో “వకీల్ సాబ్” తో పాటుగా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో కూడా పవన్ నటించనున్నారని గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కు ఇప్పుడున్న వెసులు బాటు ప్రకారం పవన్ కనుక ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తే దానికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. పవన్ ఒక 35 నుంచి 40 రోజుల షూటింగ్ డేట్స్ కు గాను 50 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు వినికిడి. అంటే పవన్ ఒక రోజు కాల్షీట్ ఇస్తే కొట్టిన్నర దగ్గరకే..ఒకప్పుడు పవన్ ఒకరోజుకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటారన్న వార్తలు ఏ స్థాయిలో సంచలనం రేపాయో తెలిసిందే. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మన టాలీవుడ్ లో మరో సంచలన రికార్డే అని చెప్పాలి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

తాజా వార్తలు