ఒంగోలు గిత్త లో అద్భుతమయిన డాన్స్ లు చేసిన రామ్

Ongole-Gittha
రామ్ రాబోతున్న చిత్రం “ఒంగోలు గిత్త” ఫిబ్రవరి మొదట్లో విడుదలకు సిద్దమయ్యింది. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. గుంటూరు మరియు తణుకు నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆడియో విడుదలలో రామ్ మాట్లాడుతూ “మణిశర్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా అయన ఇచ్చిన మ్యూజిక్ కి తగ్గ డాన్స్ వెయ్యడానికి చాల కష్టపడాల్సి వచ్చింది” అని చమత్కరించారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ నిజంగానే చాలా కష్టపడి డాన్స్ చేసినట్టు తెలుస్తుంది మణిశర్మ మ్యూజిక్ టెంపో కి తగ్గ డాన్స్ చెయ్యడానికి దాదాపుగా 27 టేక్ లు చేశారట. ఇంతా చేసింది 30 సెకండ్ల బిట్ కోసం. ఆయనని ఏనర్జేటిక్ స్టార్ అని పిలవడం ఎంత సబబు అన్న విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. కృతి కర్భంద కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందించగా ఏ వెంకటేష్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version