కళ్యాణ్-సింధుల లవ్ స్టోరీగా ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’

కళ్యాణ్-సింధుల లవ్ స్టోరీగా ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’

Published on Apr 19, 2020 2:02 PM IST

గత ఏడాది చివర్లో వచ్చిన ఓ చిన్న సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. పల్లెటూరి ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాజావారు రాణి గారు మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. హాస్యం, ఎమోషన్స్ జోడించి దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం నటన పరంగా మంచి మార్కులే అందుకున్నాడు. రెండు భిన్న షేడ్స్ లో ఉన్న పాత్రలో ఆయన నటించి మెప్పించారు.

కాగా కిరణ్ మరో వినూత్న ప్రాజెక్ట్ తో ముందుకు రానున్నారు. ఆయన తదుపరి చిత్రం ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. రేపు ఈ చిత్ర మీమ్ పోస్టర్ ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. కళ్యాణ్ మరియు సింధు అనే పాత్రలమధ్య నడిచే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈచిత్రం ఉండనుందని సమాచారం. శ్రీధర్ గాదె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎలైట్ గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు