ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ “మేఘాలు చెప్పిన ప్రేమకథ”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ “మేఘాలు చెప్పిన ప్రేమకథ”

Published on Sep 27, 2025 7:22 AM IST

రీసెంట్ గా టీజర్ ట్రైలర్ లతోనే ఎంతో అందంగా కనిపించి యువతని కట్టిపడేసే మ్యూజిక్, అద్భుతమైన లొకేషన్స్‌తో తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం థియేటర్ లో అలరించి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఒక మధురమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, దర్శకుడు విపిన్ ఈ ప్రేమకథకు సరికొత్త శైలీలో తీర్చిదిద్ది విజయం సాధించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నగేష్ అగస్త్య అలాగే రబియా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 26 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో అందుబాటులోకి వచ్చేసింది.

అందమైన లోకేషన్స్ లో కనుల పండుగలా ఉంటుంది ఈ చిత్రం. కుటుంబంతో పాటు హాయిగా చూడదగ్గ చిత్రం. కథలోని భావోద్వేగాలు మనసును ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చాలా చక్కని రైటింగ్, అలాగే మనుసుకు తాకే మ్యూజిక్ తో సాగిపోతూ ఉంటుంది. అలాగే నటన ప్రతిభతో అందరు కట్టిపడేస్తారు. లీడ్ రోల్ వరుణ్ పాత్రలోని మౌనాన్ని, భావాలను చాలా సున్నితంగా నరేష్ అగస్త్య ప్రదర్శించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ రాబియా ఖతూన్ మేఘన పాత్రలో ఇమిడిపోయారు. చాలా ఉత్సాహంగా సహజత్వం ఉట్టిపడేలా నటించారు. ముఖ్యంగా ఆమె వ్యంగ్యహాస్యం, ఉల్లాసం ప్రేక్షకులను కట్టిపడేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్ లో రాధికా శరత్‌కుమార్, సుమన్, తులసి, ఆమని పాత్రలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

థియేటర్లో ప్రేక్షకులు మనుసు దోచుకున్న ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసింది. ప్రేమ, కలలు, కుటుంబ అనుబంధాల్ని గొప్పగా మిళితం చేసిన ఈ సినిమా, ప్రధానంగా యువతను, ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కుటుంబ సమేతంగా తప్పక చూడాల్సిన ఫీల్‌గుడ్ మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమకథ. ఈ దసరా పండుగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఓటిటిలో మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

తాజా వార్తలు