ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాని తీయనున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఈ మధ్య విడుదలైన ‘జిల్లా’ సినిమాని చిరంజీవి తీయనున్నాడని సమాచారం. అయితే ఈ ‘జిల్లా’ సినిమాలో మోహన్ లాల్, విజయ్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఒకవేళ ఈ సినిమాని చిరంజీవి నిర్మిస్తే ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లు నటించవచ్చునని బావిస్తున్నారు. పలువురు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఒక ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ ఈ సినిమా స్టొరీ ని స్టడీ చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయలేదు. ఈ సినిమా నిర్మాణం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. ఒకవేళ ఈ సినిమాని నిర్మిస్తే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కళ నెరవేరుతుంది.