కోడలు ఉపాసన పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi-upasana
మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఉపాసన కొణిదెలకు ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జనాల్లోకి బాగా వెళ్తుంటాయి. మెగా ఇంటి కోడలిగా మాత్రమే కాకుండా ఓ తల్లిగా క్లిన్‌కారా బాగోగులు చూడటంలోనూ ఉపాసన తనకు తానే సాటి అనిపించుకుంది. ఇక తాజాగా ఉపాసన ఓ సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్దమైంది.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాసన కొణిదెలకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె ఈ పదవిని చేబడుతుండటంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతోంది. తమ ఇంటి కోడలు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టడం తమకు ఎంతో గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆమెను కొనియాడారు.

సరికొత్త ట్యాలెంట్‌ను వెతికి పట్టుకుని తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖకు అందించడంలో తన కోడలు ఉపాసన తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఈ మెగా మామ మురిసిపోతున్నాడు. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Exit mobile version