టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే అందరి హీరోల చూపు త్రివిక్రమ్ వైపే ఉంటుంది. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కలయికలో సినిమా అంటే నిజంగా ఎంతో క్రేజ్ తో కూడుకున్నది కూడా. ఎప్పటికైనా త్రివిక్రమ్, మెగాస్టార్ సినిమా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశ పడుతున్నారు. అయితే ఇప్పటికే మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు.
అయితే సడెన్ గా మెగాస్టార్ సినిమాల వేగం పెంచడంతో.. త్రివిక్రమ్ ఇటీవలే ఆయనను కలిసి స్టోరీ లైన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ లైన్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట. పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఎలాగూ హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి కలయికలో సినిమా రావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుంది.