మెగాస్టార్ ఐకానిక్ జర్నీ “సైరా” కు ఏడాది.!

మెగాస్టార్ ఐకానిక్ జర్నీ “సైరా” కు ఏడాది.!

Published on Oct 2, 2020 12:49 PM IST

టాలీవుడ్ లెజెండరు హీరో మెగాస్టార్ చిరంజీవి డ్రీం రోల్ గా నటించిన చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. మన తెలుగు నేల చెందిన మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ వండర్ విడుదలయ్యి నేటితో ఏడాది పూర్తయ్యింది.

అప్పటి వరకు కమర్షియల్ చిత్రాలతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రంతో అద్భుతమైన విజువల్స్ తో కూడిన భారీ చిత్రాలను కూడా తీయగలరని ప్రూవ్ చేసారు. అలాగే ఈ చిత్రానికి మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వహించి బడ్జెట్ పరంగా ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కించారు.

మెగాస్టార్ పెర్ఫామెన్స్ కోసం అయితే ఎంత చెప్పినా తక్కువే..అప్పటి వరకు నటించిన మొత్తం 150 సినిమాల పెర్ఫామెన్స్ ను ఈ సినిమాలో కేవలం కళ్ళతోనే చూపించేసారు.రత్నవేలు అద్భుతమైన విజువల్స్ అమిత్ త్రివేది సంగీతం ఇలా అన్ని అంశాలు ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్క భారతీయుడు తప్పకుండా చూడాల్సిన ఫ్రీడమ్ ఫైటర్ చిత్రంగా నిలిపింది.ఇవి మాత్రమే కాకుండా ఈ చిత్రానికి మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరొక ఎత్తు.

గత ఏడాది ఇదే రోజున గాంధీ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 2 వీక్ డే లోనే విడుదలయ్యి భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం నేటితో ఒక ఏడాదిని పూర్తి చేసుకుంది. దీనితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా జర్నీను గుర్తు చేసుకున్నారు. “బెస్ట్ ఎక్స్ పీరియన్స్”, “బెస్ట్ క్యాస్టింగ్”, ఒక బ్రిలియంట్ టీం తో చేసిన ఈ చిత్రానికి ఏడాది పూర్తయ్యిందని ఈ ఐకానిక్ చిత్రం జర్నీను గుర్తు చేసుకుని తన టీం అంతటికీ స్పెషల్ థాంక్స్ తెలిపారు.

తాజా వార్తలు