‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి రాక ముందు వరకూ ఆయన 149 సినిమాల్లో నటించారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా అయన అభిమానులు మరియు ఇండస్ట్రీలో ఉండే ఆయన శ్రేయోభిలాషులు చిరు 150 వ సినిమా చేయాలని కోరుకుంటున్నారు మరియు ఆయన ఏ కార్యక్రమానికి వచ్చినా ఆయన్ని ఈ విషయం గురించి అడుగుతూనే ఉండేవారు. ఈ విషయం పై స్పందించిన చిరు సమయం దొరికినప్పుడు, మంచికథ కుదిరితే చేస్తానులే అని చెప్పి అభిమానుల్లో ఆశలను చిగురింపజేశారు. ఇప్పటి వరకూ ఎం.పి గా ఉన్న డా. చిరంజీవి ఇటీవలే కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో చిరు మాట్లాడుతూ ‘ కేంద్రం నాకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నా భాద్యత మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో నా దగ్గర సినిమాల కోసం కేటాయించేంత సమయం లేదు. కావున నా 150వ సినిమా ఇక చేయలేనేమో’ అని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక మెగాస్టార్ 150వ సినిమా లేనట్టే అనిపిస్తోంది. ఇది మాత్రం మెగా స్టార్ అభిమానులను చాలా బాధ పెట్టే విషయం. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి మనసు మార్చుకొని తన వెన్నంటే ఉంటూ, తన కోసం ఏమన్నా చేసే అభిమానుల కోసం మనసు మార్చుకొని 150వ సినిమా చేస్తారేమో? అనే విషయాన్ని కాలమే నిర్ణయించాలి.
మెగా అభిమానులకు బాడ్ న్యూస్
మెగా అభిమానులకు బాడ్ న్యూస్
Published on Nov 6, 2012 2:50 AM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్‌తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్‌లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!