‘సలార్ 2’ కి ఉన్న క్రేజ్.. IMDb లో టాప్ లో

‘సలార్ 2’ కి ఉన్న క్రేజ్.. IMDb లో టాప్ లో

Published on Nov 15, 2025 3:00 AM IST

Salaar

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేయనున్న అవైటెడ్ మాస్ యాక్షన్ సీక్వెల్ చిత్రం సలార్ 2 కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఒక్క అభిమానులే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా కూడా ఈ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమాగా టాప్ సినీ డేట్ బేస్ లో కనిపిస్తుంది.

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో రానున్న ఇండియన్ సినిమాల లిస్ట్ లో ఈ సినిమా టాప్ 3 లో ఉంది. అంటే ఈ లెక్కన ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ప్రభాస్, దర్శకులు హను రాఘవపూడి, మారుతీ భారీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు