సమీక్ష: దే దే ప్యార్ దే 2 – కొంతమేర మెప్పించే రోమ్-కామ్ డ్రామా

సమీక్ష: దే దే ప్యార్ దే 2 – కొంతమేర మెప్పించే రోమ్-కామ్ డ్రామా

Published on Nov 15, 2025 12:01 AM IST

De De Pyaar De 2 Review

విడుదల తేదీ : నవంబర్ 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అజయ్ దేవ్గన్, ఆర్.మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్, మీజాన్, జావేద్ జాఫ్రీ, గౌతమి కపూర్ తదితరులు…
దర్శకుడు : అన్షుల్ శర్మ
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అంకుర్ గర్గ్, లవ్ రంజన్
సంగీత దర్శకులు : యో యో హనీ సింగ్, జానీ, ఆదిత్య దేవ్-పాయల్ దేవ్, అవీ స్రా, సాగర్ భటియా
సినిమాటోగ్రాఫర్ : సుధీర్ కె చైదరి
ఎడిటర్ : చేతన్ ఎం సోలంకి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కు సీక్వెల్ చిత్రం వస్తుందనే వార్తతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అజయ్ దేవ్గన్, మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సీక్వెల్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

కథ :

కుటుంబం, ప్రేమ, వయస్సు వ్యత్యాసం, రెండో అవకాశాలు వంటి పాయింట్ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. హీరో తన గతం-ప్రస్తుతం మధ్య ఇరుక్కుని, కొత్త రిలేషన్‌పై ప్రభావం చూపే విధంగా జరిగే గందరగోళమే సినిమా మెయిన్ ప్లాట్. హీరోయిన్ తన తండ్రికి అసలు విషయం చెప్పడంతో ఆ తర్వాత సాగే పరిణామాలే ఈ కథ..!

ప్లస్ పాయింట్స్ :

హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. ఫ్యామిలీ పాత్రధారులు కూడా తమతమ పాత్రలను బాగా పోషించారు.

కొంతమంది కామెడీ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చిన సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ముఖ్యంగా డైలాగ్స్ లోని టైమింగ్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితులు ప్రేక్షకులను ఎక్కడికక్కడ రిలాక్స్ చేస్తాయి.

చివరి భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమా కోసం పనిచేసే పాయింట్స్. సందేశాత్మకమైన ముగింపు ప్రేక్షకుల మనసుకు దగ్గరవుతుంది.

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం ఎక్కువగా లేదు. మొదటి భాగం శైలినే మళ్లీ ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు ఎలా సాగుతాయో ముందే ఊహించవచ్చు.

సెకండ్ హాఫ్ కొంచెం నిదానంగా సాగుతుంది. అవసరం లేని సన్నివేశాలు సినిమాలో నిడివిని పెంచి, పేస్‌ను తగ్గిస్తాయి. చాలా చోట్ల సాగదీత సీన్స్ కనిపిస్తాయి.

కొన్ని చోట్ల భావోద్వేగాలు, మరి కొన్ని చోట్ల కామెడీ సరిగా ఇంపాక్ట్ చూపించలేదు. టోన్ మార్పులు అకస్మాత్తుగా అనిపిస్తాయి, దాంతో కనెక్ట్ తగ్గుతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అన్షు్ల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్లాట్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఆయన ఈ సినిమా స్క్రిన్‌ప్లే పై మరింత ఫోకస్ చేయాల్సి ఉంది. ఎడిటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :

ఓవరాల్‌గా, అజయ్ దేవ్గన్ నటించిన క్రేజీ సీక్వెల్ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో కొంతవరకే మెప్పించింది. తొలి భాగంతో పోలిస్తే, ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర చాలా సైలెంట్‌గా ఉంది. రకుల్, మాధవన్ పాత్రలు మాత్రం సినిమాను ముందుకు తీసుకెళ్లాయి. ఇక కథలో చాలా సీన్స్ బోర్ కొట్టించడం, సంగీతం పరంగా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడం, ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం అందించకపోవడం మైనస్. ఈ సినిమా ప్రేక్షకులకు కొంతమేర ఎంటర్‌టైనింగ్‌గా అనిపించవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు