ముస్సోరిలో మెగా157 రెండో షెడ్యూల్ షురూ..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రంగా రాబోతున్న సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించిన చిత్ర యూనిట్, తాజాగా ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేసింది.

అనౌన్స్ చేయడమే ఆలస్యం అనే రీతిలో వీరు ఈ చిత్ర షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను తాజాగా ముస్సోరి ప్రాంతంలో జరపడానికి మేకర్స్ నిర్ణయించారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాట నయనతార, తదితరులు పాల్గొంటున్నారు.

ఈ రెండో షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version