పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.
కాగా, ఈ చిత్ర టీజర్‌ను జూన్ 16న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ఎలాంటి పోస్ట్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర సెట్స్ నుండి చిత్ర టీమ్ సభ్యులు నవ్వుతూ కనిపిస్తున్న ఓ ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘విధ్వంసానికి ముందు వచ్చే సంతోషం’ అంటూ వారు ఈ ఫోటోకు ట్యాగ్ పెట్టారు.
ఇక ఈ ఫోటోలో రెబల్ స్టార్ ప్రభాసతో పాటు దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు థమన్ మనకు కనిపిస్తున్నారు. ఈ టీమ్ అందరూ కలిసి ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని మిగిల్చేందుకు సిద్ధమవుతున్నారు. రాజా సాబ్ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.