దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ కోసం మరోసారి ‘లక్కీ’ మ్యూజిక్ డైరెక్టర్!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇప్పటికే ‘కాంత’, ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలను పాన్ ఇండియా చిత్రాలుగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ సెన్సేషన్ జి.వి.ప్రకాష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం కానుంది. ఇక దుల్కర్ సల్మాన్-జి.వి.ప్రకాష్ కుమార్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘లక్కీ భాస్కర్’ మూవీ మ్యూజికల్ హిట్‌గా నిలవడంతో.. ఇప్పుడు ఈ ‘ఆకాశంలో ఒక తార’ కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

Exit mobile version