సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహమాడిన మీరా జాస్మిన్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహమాడిన మీరా జాస్మిన్

Published on Feb 12, 2014 7:04 PM IST

Meera-jasmine-wedding

‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘మహారధి’, ‘యమగోల 2’, ‘పందెం కోడి’ లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మలయాళ భామ మీరా జాస్మిన్ పెళ్లి చేసుకుంది. ఈమె వివాహం ఈ రోజు అనగా 2014 ఫిబ్రవరి 12 వ తేదీన తిరువనంతపురంలోని ఓ చర్చిలో జరిగింది. మీరా జాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ టైటస్ అనే ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత వీరి పెళ్లిని ఎర్నాకులం రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ కూడా చేసారు. అలాగే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అది కూడా పెళ్లి సంబందాలు చూసే ఓ ఫేమస్ వెబ్ సైట్ ద్వారా ఈ పెళ్లి కుదిరినట్టు సమాచారం. పెళ్లి చేసుకున్న ఈ దంపతుల వివాహ బంధం సాఫీగా సాగిపోవాలని కోరుకుందాం.

తాజా వార్తలు