టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మయసభ’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ పొలిటికల్ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో ఈ సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇద్దరు లెజెండరీ పొలిటీషియన్ల జీవితకథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించడంతో ఇది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సిరీస్‌పై అంచనాలు మరింత పెరిగాయి. పదునైన రాజకీయ డైలాగులు ఈ వెబ్ సిరీస్ ఎలాంటి కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తుందా అని ఒకింత ఆతృత కూడా ప్రేక్షకుల్లో ఉంది. అయితే, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ నేటి(ఆగస్టు 6) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
దీంతో ఈ వెబ్ సిరీస్‌ను వీలైనంత త్వరగా చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. మరి ‘మయసభ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.