జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య నిర్మించిన చిత్రం ‘పొన్మగల్ వంధాల్’. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య భావించారు.అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఐతే సూర్య నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం భవిష్యత్తులో ఆయన సినిమాలు బ్యాన్ చేస్తాం అని ఓ వీడియో సందేశం పంపారు.
కాగా దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. దీనికి దళపతి విజయ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు టాక్. మరి విజయ్ మూవీ విషయంలో థియేటర్ల యాజమాన్యం ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమాలు బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు, విజయ్ కి కూడా ఇలాంటి అల్టిమేటం జారీ చేస్తారో లేదో చూడాలి.