మాస్టర్ లేటెస్ట్ లుక్ అదిరిందిగా..!

తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గత చిత్రం బిగిల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు, దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీలో విజయ్ రెండు భిన్న షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడట. ఆయన కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తుండగా మరో నేపథ్యంలో మాఫియా డాన్ గా కనిస్తాడని టాక్.

కాగా నేడు మాస్టర్ మూవీ ఆడియో విడుదల సందర్భంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ లుక్ చాల స్టైలిష్ గా ఉండగా, హీరోయిన్ మాళవిక మోహన్ ని కూడా పరిచయం చేయడం విశేషం. మాస్టర్ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తుండగా, విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు. మాస్టర్ ఏప్రిల్ 10న తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version