సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తదుపరి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబందించిన కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో సుమారు 25 ఎకరాలలో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం 10 డజన్ల గుర్రాలను బుక్ చేసారు.
2012లో వచ్చిన ‘ఈగ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తాజాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2005లో రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ మంచి విజయం సాదించడమే కాకుండా ప్రభాస్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.