‘ది డార్క్ నైట్ రైసెస్’ కి భారీ క్రేజ్

‘ది డార్క్ నైట్ రైసెస్’ కి భారీ క్రేజ్

Published on Jul 19, 2012 1:18 PM IST


ఒక పెద్ద కమర్షియల్ హీరో సినిమా విడుదలకి ముందు బాక్స్ ఆఫీసు దగ్గర క్రేజ్ మరియు భారీ ఓపెనింగ్స్ రావడం సాధారణ విషయమే. హాల్లీ వుడ్ సినిమాలకు కూడా ఇలానే జరుగుతుంది, కానీ రేపు విడుదల కాబోతున్న ‘ది డార్క్ నైట్ రైసెస్’ చిత్రానికి హైదరాబాద్లో కూడా అంతటి క్రేజ్ ఏర్పడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం బాట్ మాన్ సీరీస్ లో చివరిది. ఈ చిత్ర సీరీస్ ని దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ క్రిస్టియన్ బాలే హీరోగా మొదలుపెట్టారు.

ఈ సినిమా టికెట్స్ కోసం భారీ రద్దీ నెలకొంది మరియు ఐమాక్స్ లో ఈ చిత్రానికి సంభందించిన మొదటి నాలుగైదు రోజుల టికెట్లు అయిపోయాయి. ఐమాక్స్ కెమెరాని ఉపయోగించి ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమా విసువల్స్ ని ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే అద్భుతమైన అనుభవానికి లోనవుతారు అందువల్ల ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమా చాలా బాగుందని రివ్యూలు మరియు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ‘ది డార్క్ నైట్ రైసెస్’ చిత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది మరియు బాట్ మాన్ సీరీస్ కి ఈ సినిమాతో ముగింపు ఇవ్వనున్నారు.

తాజా వార్తలు