“క్రాక్” ఫైనల్ టచ్ స్టార్ట్ చేసేసిన మాస్ మహారాజ్.!

“క్రాక్” ఫైనల్ టచ్ స్టార్ట్ చేసేసిన మాస్ మహారాజ్.!

Published on Oct 7, 2020 10:00 AM IST

టాలీవుడ్ మాస్ మహారాజ్ ఒక సరైన హిట్ అందుకుంటే చూడాలి అని అందరి హీరోల అభిమానులు అనుకుంటున్నారు. అలా లాస్ట్ ప్రయోగాత్మక చిత్రం “డిస్కో రాజా” విఫలం కావడంతో ఇక అన్ని అంచనాలు “క్రాక్” పైనే అంతా పెట్టుకున్నారు. రవితేజ సూపర్ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో స్టార్ట్ చేసిన ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామా పై మాత్రం మంచి హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

అయితే ఇప్పుడు మాస్ మహారాజ్ ఈ చిత్రాన్ని ముగించేసే పనిలో పడ్డారు. ఈ చిత్రం తాలూకా ఫైనల్ షెడ్యూల్ ను మాస్ మహారాజ్ఈరోజే స్టార్ట్ చేశారు. వీటితో పాటుగా అంతకు మించిన ఎనర్జీతో ప్రమోషన్స్ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ మాస్ ఫ్లిక్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మరోసారి రవితేజతో శృతి హాసన్ జతకట్టిన ఈ చిత్రాన్ని గోపి వచ్చే సంక్రాంతి రేస్ లో నిలపనున్నారు.

తాజా వార్తలు