గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. పక్కా మాస్ మసాలా స్పోర్ట్స్ విలేజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకి బుచ్చిబాబు సానా నటీనటులు విషయంలో కానీ తన సాంకేతిక సిబ్బంది విషయంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ఇలా కన్నడ నుంచి మాస్ ప్రెజెన్స్ కలిగిన పవర్ఫుల్ నటుడు శివ రాజ్ కుమార్ ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి నేడు శివ రాజ్ కుమార్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ తనపై అదిరే పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో పూర్తిగా కొత్త లుక్ లో శివ రాజ్ కుమార్ కనిపిస్తుండడం విశేషం. అంతే కాకుండా తాను గౌర్ నాయుడు అనే పాత్రలో కనిపిస్తారని తన పాత్రని కూడా రివీల్ చేశారు. మరి సినిమాలో తన రోల్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.