సీడెడ్ లో ‘హరిహర వీరమల్లు’ భారీ బిజినెస్?

సీడెడ్ లో ‘హరిహర వీరమల్లు’ భారీ బిజినెస్?

Published on Jul 12, 2025 7:02 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లాంగ్ అవైటెడ్ సినిమానే “హరిహర వీరమల్లు”. నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలానే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ హిస్టారికల్ చిత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో జరిగిన రచ్చ తర్వాత బిజినెస్ పరంగా కూడా పలు కామెంట్స్ వినిపించాయి.

అయితే మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న సినిమా లేటెస్ట్ గా సీడెడ్ లో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క సీమ ప్రాంతం నుంచే 23 కోట్లకు పైగా బిజినెస్ ఈ సినిమా చేసినట్టు వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోస్ లో ఇది కూడా ఒక భారీ మొత్తమే అట. మరి రిలీజ్ అయ్యాక సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు