రవితేజ చేయాల్సిన సినిమాలో నాని ?

రవితేజ చేయాల్సిన సినిమాలో నాని ?

Published on Nov 30, 2020 8:57 PM IST

ప్రతిరోజు పండుగే సూపర్ సక్సెస్ తరువాత దర్శకుడు మారుతి తన కొత్త సినిమా స్క్రిప్ట్ పై ఇప్పటివరకూ కూర్చున్నాడు. అయితే తన కొత్త ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజతో కలిసి పని చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ చిత్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా గాసిప్ ఏమిటంటే, రవితేజ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తోంది.

మరి మారుతి తన తరువాత సినిమాని ఎవరితో ప్లాన్ చేస్తాడో చూడాలి. అయితే ‘మారుతి – నాని’ కాంబినేషన్ లో మళ్ళీ మరో సినిమా రాబోతుందని కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే కోరుకున్నారు. మరి ఎలాగూ రవితేజ తపుకున్నాడు కాబట్టి.. నాని – మారుతి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి.

తాజా వార్తలు