పవర్ స్టార్ మూవీతో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు ఆ మూవీ విడుదల చేసి తన పంతం నెరవేర్చుకున్నారు. ఆ మూవీ భారీ విజయం సాధించినట్లు వర్మ చెవుతున్నారు. పవర్ స్టార్ మూవీ ఎంత విజయం సాధించిందో ఆయనకే తెలియాలి. పవర్ స్టార్ మూవీ వసూళ్ల లెక్కలు తెలిస్తే కొందరికి గుండెలు పగిలిపోతాయని వర్మ చెప్పడం విశేషం. అలాగే పవర్ స్టార్ సిరీస్ లో మరో రెండు చిత్రాలు ఉంటాయని చెప్పడం విశేషం.
కాగా వర్మ నుండి మరో సంచలనాత్మక ట్రైలర్ రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మర్డర్ మూవీ నుండి నేడు ట్రైలర్ విడుదల అవుతుంది. దీనితో మర్డర్ ట్రైలర్ తో వర్మ మరెంత వివాదం రేపనున్నాడో అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణాలో జరిగిన ఓ పరువు హత్య ఆధారంగా ఈ మూవీ తెరక్కుతుంది. మరి చూడాలి వర్మ మర్డర్ ట్రైలర్ తో ఏమి చెప్పనున్నాడో.