మరో యువనటుడు ఆత్మహత్య

మరో యువనటుడు ఆత్మహత్య

Published on Jul 30, 2020 10:00 AM IST

చిత్ర పరిశ్రమలో విషాదాల పర్వం కొనసాగుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదంతం మరవక ముందే మరో యువనటుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. మరాఠి నటుడు అశుతోష్ బక్రే తన నివాసంలో ఉరి వేసుకొని ఉసురు తీసుకున్నారు. మహారాష్ట్ర నాందేడ్ లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అశుతోష్ వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. అశుసోత్ మరాఠి నటి మయూరి దేశ్ ముఖ్ ని వివాహం చేసుకోవడం జరిగింది.

అశుతోష్ ఆత్మ హత్యకు కారణం ఏమిటి అనేది తెలియరాలేదు. ఐతే ఆయన కొద్దిరోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్నారని సమాచారం ఉంది. ఆయన ఇటీవల సూసైడ్ పై ఓ వీడియో పంచుకోవడం విశేషం. ఆత్మహత్య మరియు అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశుతోష్ మరాఠి చిత్రాలైన బచ్చర్, ఇచ్ఛార్ తర్లా పక్కా వంటి చిత్రాలలో నటించారు.

తాజా వార్తలు