మంచు ఫ్యామిలీ మూవీతో సర్ప్రైజ్ చేయనున్న మనోజ్

Manchu-Manoj
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీంకి బాగా క్లోజ్ అయిన వారి నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీలో మనోజ్ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని చెబుతున్నారు. అలాగే ‘మనోజ్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. ఫుల్ ఎంటర్టైన్ చేసే పాత్ర. ఇది అందరికీ సర్ప్రైజ్ అని’ అంటున్నారు.

శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా హీరోలుగా కనిపించనున్నారు. ఈ మూవీలో రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రవీనా టాండన్ ఈ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో మరియు మూవీ ఇలీజ్ తేదీలను త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

Exit mobile version