అతనొక సెల్ ఫోన్ దొంగ. సెల్ ఫోన్ తో పాటు ఒక అమ్మాయి మనసు కూడా దోచుకున్నాడు. అతనెవరో కాదు డాక్టర్ మోహన్ బాబు గారి అబ్బాయి మంచు మనోజ్. ప్రస్తుతం అతను నటిస్తున్న మిస్టర్ నోకియా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతుంది. మనోజ్ ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ విభిన్న నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా అతను చేస్తున్న చిత్రమే ఈ మిస్టర్ నోకియా. దర్శకుడు అని మాట్లాడుతూ ఈ చిత్రంలో మనోజ్ పాత్ర డిఫరెంట్ గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అతని చిలిపి చేష్టలని మీకు తప్పకుండా ఇష్టపడతారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన సనా ఖాన్ మరియు కృతి ఖర్భంద హీరోయిన్లుగా నటించారు. డిఎస్ రావు నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇటీవలే విడుదలై యువతని విపరీతంగా ఆకర్షిస్తుంది.