పోటుగాడి కోసం పాడుతున్న సూపర్ స్టార్

పోటుగాడి కోసం పాడుతున్న సూపర్ స్టార్

Published on Jun 7, 2013 7:10 PM IST

Manoj-Simbu
తమిళ నటుడు శింబు తెలుగులో మరో సినిమాకు తన గళాన్ని అందిస్తున్నాడు. అతను ఇప్పటికే ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ మరియు ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాలకు పాటలను పాడాడు. తాజా సమాచారం ప్రకారం శింబు మరోసారి మంచు మనోజ్ నటిస్తున్న ‘పోటుగాడు’ సినిమాకు గానూ పాట పాడనున్నాడు. ఈ పాటకోసం వారిద్దరూ ఇప్పటికే రికార్డింగ్ ను పూర్తిచేసారు. “సూపర్ స్టార్ తో కలిసి ‘పోటుగాడు’ కోసం పాటను రికార్డింగ్ చేసాం.. నా నంబ(మిత్రునికి) ధన్యవాదాలు” అని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఈ సినిమా రెండు పాటలు మినహా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సాక్షి చౌదరి,నటాలియ కౌర్, సిమ్రాన్ కౌర్ ముండి హీరోయిన్స్. పవన్ వాడేయార్ దర్శకుడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష-శ్రీధర్ నిర్మాతలు. చక్రి , అచ్చు సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు